Madireddy Pratap and Harish Kumar: కొత్త సీఎస్‌ను ఎంపిక చేసేందుకు సీఎం కసరత్తు..! 10 d ago

featured-image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం డిసెంబర్‌ 31తో ముగియనున్నది. జూన్ 7, 2024న నియమితులైన నీరభ్ కుమార్ ప్రసాద్ మొదట జూన్ 30న పదవీ విరమణ చేయాల్సిఉండగా...ప్రభుత్వం, ఆయన పదవీకాలాన్ని డిసెంబర్ వరకు ఆరు నెలలు పొడిగించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అత్యున్నత పదవికి తగిన అధికారిని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. సీనియారిటీ ఆధారంగా 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వై శ్రీ లక్ష్మి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అయితే, ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ తో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆమెను నియమించేందుకు ముఖ్యమంత్రి విముఖత చూపవచ్చు. ఆ తర్వాతి స్థానంలో 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జి. అనంత రామును కూడా ఈ పదవికి పరిగణనలోకి తీసుకోకపోవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి. 


తదుపరి డీజీపీగా హరీష్ కుమార్?


1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమలరావు జూన్ 20న టీడీపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీస్ ఫోర్స్ (HoPF) హెడ్‌గా నియమితులయ్యారు. ఏఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు జనవరిలో పదవీ విరమణ చేయనుండగా, ఆ పదవికి తగిన అధికారిని ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 

 సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే, 10 మంది డిజి ర్యాంక్ అధికారులు ఈ పదవికి అర్హులు. వీరిలో మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తాలు ప్రతిష్టాత్మక స్థానానికి పోటీపడుతున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD